Friday, January 26, 2018

మా పరిస్థితి ఎవ్వరికీ వద్దూ..!


మిత్రులారా ఇది ఓ అమ్మ ధీనగాధ... ఉగాది పండుగరోజు అందరూ పిల్లా పాపలతో సంతోషంగా గడుపుతున్న వేల.. తన భర్తను అతి కిరాతకంగా నరికి చంపిన రోజు అది. భర్తను పోగొట్టుకుని ఊరు విడిచి వెళ్ళలేక.. నలుగురు పిల్లలను కష్టపడి పెంచి పెద్దచేసిన ఓ మాతృమూర్తి కన్నీటి కడలి. నాటి చెరిగిన జ్ఞ్యాపకాల్ని నెమరు వేసుకోవడానికే నిరాకరించారు ఆ తల్లి. ఎంతటి మనోవేదనను అనుభవించారో అర్థం చేసుకోవచ్చు. భర్తను పోగొట్టుకొని నలుగురు పిల్లల్ని పెంచి పెద్దచేసి, వారికి పెళ్ళిళ్ళు చేయడం అంటే మాటలా..? ఎంతటి కష్టాల్ని ఎదుర్కొని ఉంటారో ఊహించడానికే కష్టం. కొందరు రాజకీయ నాయకుల స్వార్థానికి బలైన ఒక ఊరి గాధ. అల్లరి మూకలు ఊరిమీదపడి.. దొరికినదంతా దోచుకుని కనపడ్డ దానినంతా కాల్చివేశారు. నేటికి మాయని మచ్చగా ఆ ఊరు నిలుచుంది. మరో వీడియోలో ఆ దృశ్యాల్ని చూపిస్తాను ఫ్రెండ్స్. ఇళ్ళలో ఉన్నవారిని బయటికి లాగి అమానుషంగా ఊరునే తగలబెట్టారు. ప్రత్యర్థులను దొరికిన వారిని దొరికినట్లు కాల్చి చంపారు. దొరకని వారిని వెంబడించి చంపారు. నేటికి మరచిపోలేని ఆనాటి పరిస్థుతులు ఎంత చెప్పుకున్నా తక్కువే. బ్రతికి ఉన్నంతవరకు ఇతడు మా వర్గమే అనే రాజకీయ నాయకులు... తమ ప్రత్యర్ధుల కత్తిపోట్లకు బలైన తరువాత కనీసం పరామర్శకు కూడా రాని నీచ రాజకీయం ఆనాడు రాజ్యమేలింది. తమను నమ్ముకుని, తమకోసం బలైన వారిని ఆదుకోవాలన్న కనీస జ్ఞ్యానం నాటికి నేటికి లేకుండా పోయింది.. పోతోంది.. పోతూనే ఉంటుంది. పచ్చటి సీమను ఒకరిద్దరు నాయకుల స్వార్థ ప్రయోజనాలకు రగిలే అగ్నిలా మార్చారు. రాయలసీమ అంటే రతనాల సీమ కాదు.. బాంబులు, కత్తులు, చంపుకోవడాలు, నరుక్కోవడాలు అనే పేరును శాశ్వతంగా ముద్రపడేలా చేశారు. కానీ నాటి రాయలసీమ వేరు నేటి సీమ వేరు.. ప్రస్తుతం ఎలాంటి గొడవలు లేకుండా మెల్లగా పచ్చటి పాడి పంటల సీమగా మారుతోంది. ఇప్పటికైనా మా సీమ మీద మరచిపోయిన గాయాల్ని మళ్ళీ రుద్ది... లేని వైషమ్యాలను రెచ్చగొట్టవద్దని.. సినీ దర్శకులను వేడుకుంటున్నాము. దానిలో భాగంగానే నా ఈ చిన్న ప్రయత్నం. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే పదిమందికి తెలియజేయండి. అలాగే ఈ వీడియో కింద రెడ్ కలర్ లో ఉన్న subscribe ని క్లిక్ చేసి మాకు అండగా నిలబడతారని ఆశిస్తున్నాను. -నాగేశ్వరరెడ్డి రాయలసీమ విలేజ్ షో

No comments:

Post a Comment