Tuesday, February 20, 2018

రాయలసీమ విలువలతో కూడిన విద్యా నిలయం Gates Institute of Technology Gooty Anantapur in Telugu 2018

Srimanthudu Movie Concept Implementation ||కోరగుంటపల్లి|| కడపజిల్లా|| Rayalaseema In Telugu 2018

Rayalaseema Factionism Inside Full Story ||జమ్మలమడుగు|| కోడికాండ్లపల్లె|| In Telugu 2018

Nethaji school 10th anniversary | gunna gunna mamidi song dance cover by childrens

Rayalaseema Solar Power Project ||కోరగుంటపల్లి ||లోమడ|| Simhadripuram ||Tata Solar|| In Telugu 2018

YSRపై మొదటిసారి పోటీచేసిన వ్యక్తి ఎవరో తెలుసా? ||YS Rajasekhara Reddy |Rayalaseema| Telugu 2018

నాణ్యమైన ఉల్లి విత్తనాల నిలయం ఆ ఊరు/How to produce your own Giant Onion Seed Rayalaseema In Telugu

Thursday, February 8, 2018

Srimanthudu Movie Concept Implementation ||కోరగుంటపల్లి|| కడపజిల్లా


శ్రీమంతుడు సినిమా స్ఫూర్తి... 80వేల రూపాయల జీతం వదిలి వ్యవసాయం బాటపట్టి... ప్రెండ్స్‌ కొన్ని సినిమాల ప్రభావం మనుషుల విషయంలో ఎంతటి ప్రభావం చూపుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. వాటి స్ఫూర్తితో ఎన్నో అద్భుతాలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మహేశ్‌బాబు, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు సినిమాలోని ఊరును దత్తత తీసుకుని మంచి చేయాలన్న స్ఫూర్తి ఎందరికో ఆదర్శప్రాయం అయ్యింది. మంచి చేయాలన్న తపన ఉన్నా అందుకు తగ్గ అవకాశం కొందరికి కొన్ని సందర్భాల్లోనే బయటికి వస్తుంది. నాడు శ్రీమంతుడు సినిమా చాలామందిలో తమ ఊరికి మంచి చేయాలన్న స్ఫూర్తినింపి... చాలామంది దానిని ఆచరణలో చేసి చూపించారు, చూపిస్తున్నారు. కానీ వారు చేసిన, చేస్తున్న మంచి పనులు చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే బయటి ప్రపంచానికి తెలుస్తోంది. దానిలో భాగంగా నేను చేసిన ఈ చిన్న ప్రయత్నం ఇది. సినిమా ప్రభావమో లేక తనలో కలిగిన స్ఫూర్తో తెలియదు కానీ, మైనింగ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తూ నెలకు 80వేల రూపాయల జీతంతో హాయిగా జీవితాన్ని గడుపుతున్న ఓ శ్రీమంతుడు చేస్తున్న ఈ పని ఎందరికో స్ఫూర్తిదాయకం. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయం చేయడంతో పాటు... పుట్టిన ఊరికి సేవ చేయడం అన్నది అభినందించదగిన విషయం. కడపజిల్లా సింహాంద్రిపురం మండలం కోరగుంటపల్లికి చెందిన దేవిరెడ్డి నర్వోత్తమరెడ్డి గారు తలపెట్టిన ఈ పనికి ఊరులో నుంచి బయట ఉద్యోగాలు చేస్తున్న ఆనేకమంది మనసున్న శ్రీమంతులు తోడ్పాటు అందించారు. పులివెందుల నియోజకవర్గంలోనే మొదటి స్కూల్‌ ప్రైవేట్‌ స్కూళ్ల మోజులో పడి మూతపడే పరిస్థితికి వచ్చిన ఆ స్కూల్‌ను నిలబెట్టి విద్యార్థులకు కావలసిని సకల సౌకర్యాలను సమకూర్చుతూ... కోట్లమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ చదువుకున్న శ్రీమంతులు. ప్రెండ్స్‌ రాయలసీమలో ఇలాంటి వారు చేస్తున్న మంచి పనులను ప్రపంచానికి తెలియచేద్దాం. మీరు నాకు సహాకారం అందిస్తే. ఎవరైనా అలాంటివారు ఉంటే నాకు తెలియజేయండి. వారి గురించి ప్రపంచానికి తెలియజేయడంతో పాటు... ఇంకా ఇలా చేయాలనుకుని మనసులోనే దాచుకున్న వారికి స్ఫూర్తి నింపడంతో పాటు... ఒకదారి చూపే అవకాశం ఉందని నమ్ముతున్నాను ప్రెండ్స్‌. -నాగేశ్వరరెడ్డి స్పెషల్ థాంక్స్ టూ శ్యాం సుందర్ (8886444043) Mail Id- rayalaseemavillageshow@gmail.com

YSRపై మొదటిసారి పోటీచేసిన వ్యక్తి ఎవరో తెలుసా?


దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ రాజశేఖరరెడ్డి మొదటిసారి పులివెందుల శాసనసభకు 1978లో పోటీ చేసినప్పుడు ఆయనపై సింహాంద్రిపురం మండలం... కోరగుంటపల్లి గ్రామానికి చెందిన దేవిరెడ్డి నారాయణరెడ్డిగారు ప్రత్యర్థిగా పోటీచేశారు. ఈ విషయం చాలామందికి తెలిసిఉండదని అనుకుంటున్నాను. ఆ తరువాత వైఎస్‌ఆర్‌ తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరపరచుకుని... 1978లో జనతాపార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని విజయం సాధించిన మొదటిసారే రాష్ట్ర మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పదవిని దక్కించుకున్నారు. రెండేళ్ళు తిరక్కుండానే ముఖ్యమంత్రులు మారినా ఎక్సైజ్, విద్యాశాఖలు లభించాయి. అప్పటికే అయన స్ట్రాంగ్ లీడర్ గా తనకంటూ ఒక గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్నారు. రాజశేఖరరెడ్డి గారు మొత్తం 6సార్లు పులివెందుల నుంచి ఎన్నికకాగా, 4సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు. ఆ తరువాత చాలా కాలంపాటు ఎటువంటి ప్రభుత్వ పదవీ దక్కలేదు. 1989-94 మధ్య ముఖ్యమంత్రి పదవికోసం ప్రయత్నించినా అవకాశం రాలేదు. 1999లో మళ్ళీ శాసనసభకు ఎన్నికై ప్రతిపక్షనేతగా ఉంటూ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు వ్యూహం రచించాడు. 2003లో మండువేసవిలో 1460 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర, ఉచిత విద్యుత్ ప్రచారం ఆయన విజయానికి బాటలు పరచింది. 2004 ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గం నుంచి 40వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు పొందడంతో ముఖ్యమంత్రి పీఠం వైఎస్.రాజశేఖరరెడ్డికే దక్కింది. రెండవసారి కూడా చిరంజీవి ప్రభంజనాన్ని తట్టుకుని అధికారంలోకి వచ్చారు. నాడు ప్రజలు ఇంతచేసినా నాకు పాసు మార్కులు మాత్రమే వేశారు అని.. ఇంకా కష్టించి పనిచేయాలని చెప్పి నిత్యం ప్రజల మధ్యన ఉండటానికి ప్రయతించారు. దానిలో భాగంగానే ఆయన సెప్టెంబర్ 2, 2009న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తూ నల్లమల అడవులలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యాడు.

Rayalaseema Factionism Inside Full Story


Rayalaseema Solar Power Project ||కోరగుంటపల్లి ||లోమడ


ఫ్రెండ్స్ కరువుకు నిలయమైన రాయలసీమలో ప్రస్తుతం సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. వీటిద్వారా అనేక మంది సీమ యువతకు ఉపాధి దక్కుతుంది. సమీప పరిసర దినసరి కూలీలకు కూడా రోజూ సోలార్ ప్యానల్స్ శుభ్రం చేసే పనులు దొరుకుతాయి. ప్రస్తుతం రాయలసీమలోని అనంతపురం జిల్లాలో ఈ సోలార్ ప్రాజెక్ట్స్ బాగా పెడుతున్నారు. అదేవిధంగా కడపజిల్లా సింహాద్రిపురం మండలం లోమడ, కోరగుంటపల్లి పరిసర గ్రామాల్లో టాటా సోలార్ పవర్ ప్రాజెక్ట్ దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పింది. 15మందికి ప్రత్యక్ష్యంగా, 30 మందికి పరోక్ష్యంగా ఉపాధి లభిస్తోంది. అంతేకాదు సమీప పరిసర గ్రామాల ప్రజలకు తమ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. నిజంగా అభినందించి తీరాలి. ఈ సోలార్ ప్రాజెక్ట్ కి చాలా తక్కువ పెట్టుబడి, ప్రభుత్వం అధిక రాయితీలు ఇస్తుండటంతో పెద్ద పెద్ద కంపెనీల దృష్టి ప్రస్తుతం రాయలసీమపై పడింది. పనికిరాని పొలాలను ఈ విధంగా సోలార్ ప్రాజెక్ట్స్ కోసం ఉపయోగించుకుని మరింతమందికి ఉపాది అవకాశాలు రావాలనే ఉద్యేశంతో ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్, షేర్ చేయడంతో పాటు మా ఛానల్ ని subscribe చేయండి. మరింత ఆసక్తితో ఇలాంటి మరెన్నో వీడియోలను అందిస్తాము. మీరు కూడా మీ ప్రాంత సమస్యలు, అభివృద్ధి, పురాతన దేవాలయాల గురించి వీడియో రూపంలో పంపవచ్చు. Rayalaseema Varapradhayini Solar Power Project ||Koraguntapalli | Lomada|| Simhadripuram ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ ని ఆదరించండి.. వీడియో కింద రెడ్ కలర్ లో ఉన్న subscribe ని క్లిక్ చేయండి. (Friends Please Support & Subscribe my channel) Youtube channel link:- https://www.youtube.com/RayalaseemaVillageShow043 వాట్స్ యాప్ గ్రూప్ లింక్:- https://chat.whatsapp.com/invite/AGRQnLFOnCzEAXdkkqqoIY Youtube channel link:- https://www.youtube.com/RayalaseemaVillageShow043 Blog:- http://rayalaseemavillageshow.blogspot.com Mail Id- rayalaseemavillageshow@gmail.com Face Book- https://www.facebook.com/profile.php?id=100022605697096 Face book page- https://www.facebook.com/RayalaseemaVillageShow043/ Twitter- https://twitter.com/rayalaseemavill Image may contain: 1 person, text

Gurijala zph School | gurijala