Thursday, February 8, 2018

Srimanthudu Movie Concept Implementation ||కోరగుంటపల్లి|| కడపజిల్లా


శ్రీమంతుడు సినిమా స్ఫూర్తి... 80వేల రూపాయల జీతం వదిలి వ్యవసాయం బాటపట్టి... ప్రెండ్స్‌ కొన్ని సినిమాల ప్రభావం మనుషుల విషయంలో ఎంతటి ప్రభావం చూపుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. వాటి స్ఫూర్తితో ఎన్నో అద్భుతాలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మహేశ్‌బాబు, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు సినిమాలోని ఊరును దత్తత తీసుకుని మంచి చేయాలన్న స్ఫూర్తి ఎందరికో ఆదర్శప్రాయం అయ్యింది. మంచి చేయాలన్న తపన ఉన్నా అందుకు తగ్గ అవకాశం కొందరికి కొన్ని సందర్భాల్లోనే బయటికి వస్తుంది. నాడు శ్రీమంతుడు సినిమా చాలామందిలో తమ ఊరికి మంచి చేయాలన్న స్ఫూర్తినింపి... చాలామంది దానిని ఆచరణలో చేసి చూపించారు, చూపిస్తున్నారు. కానీ వారు చేసిన, చేస్తున్న మంచి పనులు చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే బయటి ప్రపంచానికి తెలుస్తోంది. దానిలో భాగంగా నేను చేసిన ఈ చిన్న ప్రయత్నం ఇది. సినిమా ప్రభావమో లేక తనలో కలిగిన స్ఫూర్తో తెలియదు కానీ, మైనింగ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తూ నెలకు 80వేల రూపాయల జీతంతో హాయిగా జీవితాన్ని గడుపుతున్న ఓ శ్రీమంతుడు చేస్తున్న ఈ పని ఎందరికో స్ఫూర్తిదాయకం. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయం చేయడంతో పాటు... పుట్టిన ఊరికి సేవ చేయడం అన్నది అభినందించదగిన విషయం. కడపజిల్లా సింహాంద్రిపురం మండలం కోరగుంటపల్లికి చెందిన దేవిరెడ్డి నర్వోత్తమరెడ్డి గారు తలపెట్టిన ఈ పనికి ఊరులో నుంచి బయట ఉద్యోగాలు చేస్తున్న ఆనేకమంది మనసున్న శ్రీమంతులు తోడ్పాటు అందించారు. పులివెందుల నియోజకవర్గంలోనే మొదటి స్కూల్‌ ప్రైవేట్‌ స్కూళ్ల మోజులో పడి మూతపడే పరిస్థితికి వచ్చిన ఆ స్కూల్‌ను నిలబెట్టి విద్యార్థులకు కావలసిని సకల సౌకర్యాలను సమకూర్చుతూ... కోట్లమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ చదువుకున్న శ్రీమంతులు. ప్రెండ్స్‌ రాయలసీమలో ఇలాంటి వారు చేస్తున్న మంచి పనులను ప్రపంచానికి తెలియచేద్దాం. మీరు నాకు సహాకారం అందిస్తే. ఎవరైనా అలాంటివారు ఉంటే నాకు తెలియజేయండి. వారి గురించి ప్రపంచానికి తెలియజేయడంతో పాటు... ఇంకా ఇలా చేయాలనుకుని మనసులోనే దాచుకున్న వారికి స్ఫూర్తి నింపడంతో పాటు... ఒకదారి చూపే అవకాశం ఉందని నమ్ముతున్నాను ప్రెండ్స్‌. -నాగేశ్వరరెడ్డి స్పెషల్ థాంక్స్ టూ శ్యాం సుందర్ (8886444043) Mail Id- rayalaseemavillageshow@gmail.com

No comments:

Post a Comment